విత్తే సమయం :

ఖరీఫ్ లో  తేలికపాటి నేలల్లో జూన్ రెండవ పక్షం నుండి జూలై 15 వ తేది వరకు, బరువు నేలల్లో ఆగష్టు రెండవ పక్షంలో విత్తుకోవచ్చు.

రబీలో వర్షాధారం కింద సెప్టెంబర్లో, నీటిపారుదల కింద అక్టోబర్ రెండవ పక్షం నుండి జనవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

వేసవిలో నీటిపారుదల కింద జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

ఎర్రనేలలు మరియు నల్లరేగడి నెలల్లో వరి తరువాత ప్రొద్దుతిరుగుడు వేసుకొనే పక్షంలో డిసెంబర్ ఆఖరివారం నుండి జనవరి మొదటి వారం వరకు విత్తుకోవాలి.

విత్తే సమయం కూడా ప్రొద్దుతిరుగుడు యొక్క నూనె నాణ్యతను పెంచుతుంది.

పువ్వు వికసించే మరియు విత్తనం గట్టి పడే సమయంలో ఎక్కువగా పగలు (12 గంII లు) మరియు సూర్యరశ్మి ఉన్నట్లుయితే నూనె శాతం ఎక్కువగా వస్తుంది.